विशेष रुप से प्रदर्शित पोस्ट

लिंग बनने का तरीका

 लिंग :   स्त्री जाति/ पुरुष जाति के बारे में बताने वाले शब्द को लिंग कहते हैं।  उदाहरण:  पुं  लिंग - स्त्री लिंग     माता - पिता       राम - सीता       लड़का - लड़की  लिंग 12( बारह) तरीकों प्रत्यय से बनता है।  1. अ ,2.आनी,3.आइन,4.इनी,5.इया,6.इका,7.इन,8.ई,9.नी,10.वती/मति,11.त्री,12. प्रत्यय फ्री (No suffix)         

అండతో రెచ్చిపోయే బుద్ధిని వీడండి

అన్నలు, నక్సలైట్లు అంటే ఎందుకు ఆ భయం 

వాళ్ళని ఏరివేసి తీరాలని ఎందుకు ఆ పంతం 

మీరు అటవీ సంపదను దోచుకోకుండా అడ్డుపడతారనా 

మీ దౌర్జన్యాన్ని దహించేస్తారనా 

ఆదివాసులకు అండగా ఉంటారనా... 

మీరు ఈ గడ్డపై రాకముందు నుండే 

తరతరాలుగా ఈ గడ్డ నీ 

రక్షించుకుంటూ వచ్చినవాళ్ళ వారసులు వారు 

అత్యాశకు పోకుండా

 వారు వదిలేసిన అధికారాన్ని  

చేజిక్కించుకుని మీరు

ఎగిరెగిరి పడొద్దండి...

ఇకనైనా వీడండి 

అధికారం అండతో రెచ్చిపోయే వక్ర బుద్ధిని ..

చెప్పేది మంచి మాటలు

చేసేది ముంచే పనులు ....

అడవిబిడ్డల పట్ల , అడుగునబడిన వారి పట్ల

  ఉంటే అంత చింత  

వారి సమస్యలను తెలుసుకొని 

పరిష్కరించండి వాటిని...

వారు అన్నలుగా మీ దృష్టిలో నక్సలైట్ గా 

మారడానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకోండి

అడవి బిడ్డలేమి విదేశీయులు , ఉగ్రవాదులేమీ కాదు 

ఈ భూమి మీద పుట్టి ,భూమికై , స్వతంత్రంకై 

ప్రాణాలు ఇచ్చినవారి వారసులు వారు

నేడు మీరు అధికారం ఉందని మీ మతం కులం నీ 

పెద్దదిగా చూపించడం కోసం అన్నలను బలి ఇవ్వొద్దు....


टिप्पणियाँ