विशेष रुप से प्रदर्शित पोस्ट

మీరు సృష్టించిన భగవంతునికే తెలియాలి !!!

మీరు వందలాది సంవత్సరాలు 
అనుభవించితిరి రిజర్వేషన్లు 
సామ-దాన-భేద-దండోపాయాలను ఉపయోగిస్తూ... 
అంభేడ్కర్ లాంటి జ్ఞాన పర్వతం ముందొచ్చి నిలబడితే 
చేసేదేమీ లేక జాతి, కుల వివక్షతలను చూపుతూ 
ఇచ్చిండ్రు రిజర్వేషన్లు...
రిజర్వేషన్లు వచ్చి ఇన్నేళ్లయినా 
పేదోడి బ్రతుకు పెద్దోడితో కాకపాయ సమానం 
పల్లెటూర్లలోని పెద్ద మనుషుల పెత్తనం
పట్నాలలోని రెడ్ల పెత్తనం...
అగ్రవర్ణాలే పెద్ద మనుషులు 
అగ్రవర్ణాలే పాలకులు
పెద్దోడు ఫోన్ చేస్తే పోలీస్ కేసు ఉండదు 
బలమైన సాక్ష్యాలతో కేసు నమోదు చేపించిన
ఎంత పెద్ద కేసైనా  దొరుకుద్ది బెయిల్ ఐదే నిమిషాలలో
పెద్దోడు కన్నెర చేస్తే  కేసును వాదించడు లాయర్
పెద్దోడు వేలెత్తితే ఏ పత్రికల్లోనూ 
తమ ప్రతికూల రాత ఉండదు 
పెద్దోడు సైగ చేస్తే గవర్నమెంట్ ఉద్యోగి 
ఏ పనినైన చేసేస్తాడు  ప్రశ్న లేకుండానే ...
రిజర్వేషన్లు వల్ల వచ్చిన 
పురోగతి ఎంత శాతం 
పెద్దోడిలో పేదోడిలో వచ్చిందో 
చూడండి కనులు తెరచి  
ఇటువంటీ రిజర్వేషన్లను కూడా 
ఓర్చుకోలేక మీరు ఆనాడు అసహ్యించుకున్న 
జాతి కులం వివక్షతనీ మరచి 
ఈనాడు డబ్బున్నోళ్లకి ఓ రిజర్వేషన్ 
డబ్బు లేని వాళ్ళకి ఓ రిజర్వేషన్ అని 
కొత్త పదముని 
ఏ మొహం పెట్టుకొని పలుకుతున్నారో 
పంచముడిని సృష్టించిన ఆ వంచకుడికో లేదా
మీరు సృష్టించిన భగవంతునికో తెలియాలి !!!

टिप्पणियाँ