विशेष रुप से प्रदर्शित पोस्ट
- लिंक पाएं
- X
- ईमेल
- दूसरे ऐप
గులాం-లాల్ సలాం
మేడే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం
కార్మిక శక్తికి, శ్రామిక శక్తికి మించిన సంపదలే
ఇల లేవంటూ గర్జించి,
సమైక్యత శక్తులనే సాధించిన విప్లవం..
శ్రమ జీవన సౌందర్యాన్ని చాటించిన శుభదినం
యుగయుగాల దౌర్జన్యాలను, దోపిడీ వ్యవస్థలను ఎదిరించి
చేయెత్తి జై కొట్టిన పోరాట దినం..
పెట్టుబడిదారుల దోపిడీ నిరంకుశత్వాన్ని
ప్రశ్నించిన విప్లవ శంఖారావం..
వర్తమాన జీవన స్రవంతికి శ్రామిక శక్తియే ఆధారం
పలుగూ, పారా, సుత్తీ, కొడవలి, నాగలియే సంపదలై ప్రగతికి బాటలు వేసిన
శ్రామిక వర్గం..
నరనరాన సత్తువను శక్తిగా మార్చి రేయింబవళ్ళు రెక్కలు ముక్కలు చేసుకున్నా
ఆకలి డొక్కలతో, తీరని దాహంతో
గుండెల మంటలు రేగిన ఆర్తనాదం
కొండలని పిండి చేసిన
కండలు కరిగించిన శ్రమస్వేదం ..
ఎగసిన కెరటాలై ఉప్పొంగిన
గులాంగిరీకి స్వస్తి పలికి నింగికి
ఎగిరిన ఎర్రెర్రని జెండా
నినాదం
ప్రతి హృదయాన్నీ కన్నీళ్లతో కరిగించి
శ్రమ జీవన విలువలనే చాటి చెప్పిన విప్లవ వేదం..
మే డే కార్మిక దినోత్సవం..
*****
పద్మావతి పి
హైదరాబాద్
9652446264
Location:
Hyderabad, Telangana, India
- लिंक पाएं
- X
- ईमेल
- दूसरे ऐप
टिप्पणियाँ