विशेष रुप से प्रदर्शित पोस्ट
प्रस्तुतकर्ता
MahaabhojMD
को
- लिंक पाएं
- X
- ईमेल
- दूसरे ऐप
ప్రైవేటు ఉద్యోగం తెచ్చింది గుర్తుకి
పాత కాలంలోని పెద్దోళ్ల ఇంట్లో గాసం ను
స్వేచ్ఛ, స్వతంత్రం
వ్యక్తిత్వం , విషయ పరిజ్ఞానం
రానే రాదు ఏ అక్కరకు …
క్వాలిటీ కంటే ఫార్మాలిటీస్ కే అధిక ప్రాధాన్యత.
ఉదయాన్నే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుని
అల్పాహారం ముగించుకొని
గదిలో నుండి కాలినడకన
స్కూల్ కి బయలుదేరాక కొద్దిపాటి సమయం నుండే మొదలవుతుంది శారీరిక నొప్పి
పాదాల నుండి మోకాళ్లపై రావడం ….
మళ్ళీ పాఠశాలలో వెళ్లి
ఆఫీసులో బయోమెట్రిక్ వేసి రిజిస్టర్లో సంతకం చేసి
బయటకు వచ్చి వెళ్ళాలి ప్రార్థన సభకి
ప్రార్థన సభ ముగిశాక
మొదలైతుంది అసలైన వ్యధ …
రోజుకు ఉన్న ఎనిమిది పిరియడ్లలో
ఆరు క్లాసులు తప్పనిసరి
అందులో ఏడవది substuition ఉండి తీరుతుంది
అప్పుడప్పుడు ఎనిమిదో పీరియడ్ కూడా ఉండొచ్చు..
స్కూల్ మొదలైనప్పటి నుండి ఉండాలి నిలబడే
మొదటి పిరియడ్ నుండి చివరి పిరియడ్ వరకు
కాళ్ళకి మోకాళ్ళకు సుఖాన్ని ఇచ్చేది
ఇంటర్వెల్ లంచ్ బ్రేక్ మాత్రమే …
సాయంత్రం ఐదు గంటలకు స్కూలు ముగిసిన
కాళ్ల నొప్పి మాత్రం ముగియదు …
గదికి వచ్చి నేల మీద మొబైల్ కు
తనను తాను అంకితం చేసుకొని నిద్రిస్తే తప్ప
శరీరం మనసు మెదడు ఒక కొలిక్కి రావు…
శారీరక నొప్పి ఈ విధంగా ఉంటే
మానసిక నొప్పి ఇంకో విధంగా ఉంటుంది
టౌన్ లో గల ప్రభుత్వ-ప్రైవేటు బళ్లలో పాటలు చెప్పడం
ఏమంత సులభమేమి కాదు
టౌన్ లో చదివే పిల్లలంతా
డబ్బున్నోళ్లకి డబ్బులకి వారసులై ఉంటారు
ఆ డబ్బు వారసులు
అహంకారమని గర్వము నింపుకొని ఉంటారు
అహంకారం గర్వం నింపుకున్న మెదడుకి
చెప్పింది వినాలన్న స్వయంగా చదువుకోవాలన్న
వారి ఆస్తి అంతస్తులు ఖచ్చితంగా అడ్డు వస్తాయి..
వారిని క్రమశిక్షణ పెట్టడానికి
చదువు వైపు మళ్ళించడానికి
బ్రతిమిలాడి భయపెట్టి
నీతి వాక్యాలు ఆదర్శ వాక్యాలు చెప్పి
అవసరమైతే రెండు దెబ్బలేస్తే చదువుని మెదడులోకి ఎక్కించు కుంటారు అనుకుంటే …..
దెబ్బేసిన మరుక్షణమే మగ పిల్లవాడు
పగ ద్వేషం పెంచుకొని
అర్థవంతం లేని కాకికూతలు కూస్తాడు..
ఆడపిల్లలైతే వంకరగా చూసిండు టార్గెట్ చేసిండు
ప్రవర్తన ఏదోలా ఉందని
తల తోక లేని కారణాలు చెప్తారు…
తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను
కొట్టకూడదు తిట్టకూడదు
చదువు తర్వాత చూసుకుందాం వదిలేయండి
అని బాధ్యత రహితంగా ప్రవర్తించ సాగే…
ఇవన్నీ ప్రధానోపాధ్యాయులకు ప్రిన్సిపల్ కి చెబితే
అడ్మిషన్స్ కి ప్రాబ్లం అవుతుందని
స్కూల్ పేరు పాడవుతుందని నోరు నొక్క సాగే…
సరే పెద్దోళ్ల పిల్లలతో ఎందుకని వదిలేస్తే
నెలవారి పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ కు వచ్చి
మీరు చదువు చెప్పటం లేదని దండయాత్ర చేయబట్టే..
ఇవన్నీ తలుచుకుని
ప్రైవేట్ ఉద్యోగం చేయకూడదనుకుంటే
చదివిన పెద్ద చదువు, పరిస్థితులు గుర్తుకురాసాగే….
- Raavan.MD
टिप्पणियाँ