विशेष रुप से प्रदर्शित पोस्ट

ఒకవేళ నేను కూడా పురుషున్ని అయ్యి ఉంటే…..

 నేను కూడా ఇంటికి గడ పెట్టుకోకుండా నిద్రపోయేదాన్ని

 ఒకవేళ నేను కూడా పురుషున్ని అయ్యి ఉంటే…..


గాలిపటంలా ఎగురుతూ దుంకుతూ నిద్రపోయేదాన్ని 

రాత్రంతా మిత్రులతో చెట్టాపట్టా లేసుకొని తిరిగేదాన్ని 

స్వేచ్ఛ స్వతంత్రంతో భయం లేకుండా ఉండేదాన్ని 

ఒకవేళ నేను కూడా పురుషున్ని అయ్యి ఉంటే ….


చెబుతుంటే అందరికీ, వినింది అమ్మ

మీ ఆడపిల్లలను చదివించండి అని 

శక్తిశాలిని చేయండి అని …

విని ఆ మాటలు 

ఇంటికి దూరంగా పంపించి చదివించిరి 

డాక్టర్ గా శక్తిశాలి గా చేసిరి….

ఇంటికి దూరంగా పంపించకుంటే

అమ్మ కూడా కోల్పోయేది కాదు తన ముత్యాల బిడ్డనీ…

ఒకవేళ నేను కూడా పురుషున్ని అయ్యుంటే….


36 గంటల వరుసగా నాపై దాడి దౌర్జన్యం అయ్యే 

చెప్పుకోలేని బలవంతపు అత్యాచారం అయ్యే 

చివరకు ఈ జన్మ నుండి బహిష్కారం అయ్యే….

పురుషుని పురుషతత్వంతో ఇంటర్వ్యూ అయ్యే …

ఒకవేళ ఆ పురుషుల్లో కూడా 

కొంచెం అయినా స్త్రీతత్వ కోమలత్వం ఉండి ఉంటే ….

ఒకవేళ నేను పురుషుని అయి ఉంటే …


చెబుతున్నారు CCTV లేదని

ఉండి ఉన్నా ఏమవుతుండే 

సీసీటీవీ దగ్గర పురుషుడే ఉండు 

వాడి దృష్టి ఎలా ఉంటుండునో... 


ఒకవేళ నేను ఒక పురుషున్ని అయి ఉంటే 

అయ్యుంటే మాత్రం ...

ఈరోజు నేను బతికి ఉండేదాన్ని…



टिप्पणियाँ