विशेष रुप से प्रदर्शित पोस्ट

आजादी के लिए सब लड़े थे

 कैसे होगी विकास हालत है ऐसी।। आजादी के लिए सब लड़े थे मिलजुल कर हिंदू , मुस्लिम, ईसाई ,सिख, जैन और बौद्ध ब्राह्मण, क्षत्रीय ,वैश्य ,शूद्र ,शेख ,सैयद, एवं पठान SC , ST , BC , OC और OBC ।। मगर जब गाद्दी पर बैठने की समय आया एक ही जाति बैठकर वह सिर्फ अपना जाति, राज्य ,प्रांत व परिवार को ही विकास की ओर लेकर गया और कुर्सी को बचाए रखने के लिए  दूसरा जाती परिवार प्रांत को दूर रखकर उनके कमजोरियों एवं मजबूरियों से प्यार कर अपमान का पहाड़ खड़ा किया परिणाम निकला अलग-अलग होना एक दूसरे पर यकीन ना कर पाना  छोटी-छोटी बातों पर लड़ाई झगड़ा शुरू हो जाना अतएव हालत है ऐसी कैसे होगी विकास ।।

సమస్యలు రోజువారి కార్యకలాపాలు&పనులు

 సమస్యలు రోజువారి కార్యకలాపాలు&పనులు 


ఊహించొద్దు ఆశించొద్దు 

జీవితం చాలా సుఖంగా ఒడిదుడుకు లేకుండా ఉంటుందని 

అది కేవలం సినిమాలోనే జరుగుతుంది 

స్నేహితులతో సరదాలు,

 హీరోయిన్ చూసి ఇష్టపడటం తనకు చెప్పటం 

తను కొన్ని రోజులు వెంట తిప్పుకొని ఒప్పుకోవటం

 పెళ్లి చేసుకోవడం, ఉద్యోగం దొరకటం 

సినిమా చివర్లో రౌడీ రావడం ఫైట్ చేయటం 

భార్యను కౌగిలించుకోవడం 

ఆ తర్వాత శుభం పడటం 

ఇదంతా సినిమాల్లోనే జరుగుతుంది … 

నిజ జీవితం అలా ఉండదు. 

దేవుడు ఎప్పుడూ 

కలుపుతూ ఉంటాడు మంచిని చెడును 

ఎలా అంటే ఆడ-మగ వారిలా 

కరెంటు తీగల్లోని పచ్చ-ఎర్ర తీగలలా, కూడిక-తీసివేతలా.

అందరం ఒక్కటే అన్నప్పుడు ఎవరో ఒకరికి 

ఈర్ష అత్యాశ కోపం భయం పుట్టడం 

మగవాళ్ళు సర్దుబాటు ఉన్నప్పుడు 

ఆడవాళ్ళలో అసంతృప్తి ఉండటం

మనం ప్రేమించిన అమ్మాయి వెధవల్ని ఇష్టపడటం 

మనం ఆనందంగా ఉంటే పక్కింటోళ్లు ఈర్షతో ఏదో ఒకటి వాగటం , 

పడని వాళ్లతో చేయగలపటం

భార్య మంచిదైతే అత్తయ్య గయ్యాళవ్వటం 

మామ అర్థం చేసుకునే వాడు అయితే 

భార్య అర్థంపర్థం లేకుండా మాట్లాడేది అవ్వడం 

ఉద్యోగం మంచిదైతే తోటి వాళ్ళు మంచి వాళ్ళు అవ్వకపోవడం 

నచ్చని వాళ్ళతోనే ఎక్కువ సమయం గడపాల్సి రావడం

ఇదంతా జీవితంలో వచ్చే రోజువారి కార్యకలాపాలు 

ఒక్కొక్కసారి నిజ జీవితంలో 

వర్ణించలేని సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు 

అందుకే నీవు సమర్థునివై ఉండాలి…

లేకపోతే మనుషులలోని మూడు రకాలలో 

ఇతరుల సమస్యలు నుండి నేర్చుకునే సమర్థునిగా

తన కష్టాలనుంచి నేర్చుకునే సాధారణ సమర్ధునిగా … ఉండి తీరాలి

తన-ఇతరుల నుండి నేర్చుకోకపోతే అసమర్థునిగా

మిగిలి కుంగి-కుంగి కుషించిపోతావ్…

ఎందుకంటే సమస్యలు రోజువారీ కార్యకలాపాలు 

ఖచ్చితంగా వాటిని తీర్చుకోవాల్సిందే…..

टिप्पणियाँ