विशेष रुप से प्रदर्शित पोस्ट

సౌభ్రాతృత్వాన్ని అందుకోండి…

 

సమర్థులు ముందడుగు వేయకపోతే మేలుకోకపోతే 

ముందడుగు వేసి మేల్కోని అసమర్థులు

సమర్థవంతమైన వ్యవస్థలను 

మార్చేస్తారు అసమర్థవంతంగా..

డబ్బుతోనే దేనినైనా సాధించవచ్చని 

దౌర్జన్యంతోనే దేనినైనా పొందవచ్చని 

అధికారంతోనే దేనినైనా శాసించవచ్చని

సామరస్యం కంటే దౌర్జన్యం మిన్న అని 

చదువు సంస్కారం కంటే అధికారం మిన్న అని 

మాట కంటే డబ్బు మిన్న అని 

విచిత్ర వేషాలు వేయించి 

మంచికి చెడును, చెడుకు మంచిని పరిచయం చేసి 

వెంట ఉన్నవాళ్లను కార్యకర్తలను 

అనుచరులను అయిన వాళ్లను 

మూర్ఖులుగా మొండివాళ్ళుగా మార్చేస్తారు.

అందుకే నవ యువకులారా మేల్కొనండి 

చదువు సంస్కారం సామరస్యం మాటకి విలువనిచ్చి 

అందుకోండి… రాబోయే తరం నుండి 

శాంతిని సౌభ్రాతృత్వాన్ని 

                    

                                -  రావణ 


टिप्पणियाँ