विशेष रुप से प्रदर्शित पोस्ट
प्रस्तुतकर्ता
MahaabhojMD
को
- लिंक पाएं
- X
- ईमेल
- दूसरे ऐप
ఎంత ప్రేమ అయితే ఉందో అంతే మౌనంగా....
మనసు మాటను మనసులో దాచేస్తాను
ఇదే నా దోషం అయ్యింది నేడు
అందుకే ఎంత ప్రేమతో ఉందో నాలో
అంతే మౌనంగా ఉండి పోయా నేడు…
నా కథను ఎలా చెప్పను
ఎటు నుంచి మొదలెట్టినా నీ పేరే వచ్చును
ఒకవేళ నేను ఆ గౌరవపాలైన నిందలు పడిన
నీవు కూడా తలదించుకోవాల్సి వచ్చును…
దాని యొక్క ఫలితంలో
ప్రేమ ఎటువైపు దారి తీస్తుందో అని
తరచుగా నేను చింతిస్తూ ఉంటాను
అందుకే ఎంతైతే ప్రేమ ఉందో
అంత మౌనంగా ఉండిపోయాను ..
చూపించలేకపోయా నీ ఆశాజనకమైన ప్రేమని
ఇదే భారం పెంచెను నాలో
నేనెంత నిస్సహాయుడనో నీకు చెప్పాలనియున్న
నేనెంత నిస్పృహాడనో నీకు చూపాలని ఉన్న
చెప్పా లేక చూపాలేక
మౌనంనే అలంకరణగా పూసుకొని ఉన్నా….
నా పిచ్చి మనసుకు కూడా ఇదే
అలవాటు చేయిస్తూ ఉన్నా…
తెలుసుకోవే
నీపై ప్రేమ ఎక్కువై పిచ్చిదైందోమో కానీ
నేను మాత్రం పిచ్చోడిని కాదని
అందుకే ఎంత ప్రేమతో ఉందో
అంతే మౌనంగా ఉండి పోయా ...
మనసు మాటను మనసులో దాచేస్తాను
ఇదే నా దోషమయ్యింది నేడు.
टिप्पणियाँ