विशेष रुप से प्रदर्शित पोस्ट
प्रस्तुतकर्ता
MahaabhojMD
को
- लिंक पाएं
- X
- ईमेल
- दूसरे ऐप
ఒక్కసారైనా నీవే రావా!!
నీవు నాతో లేవన్న బాధ,
మళ్ళీ కలుస్తావో లేదో అన్న బాధ,
మళ్లీ సమాజంలోని బాధలు
ఏమి చేయను !!
అయినా కన్నులు ఎదురు చూసే నీకై ,
రాత్రంతా మెలుకోని
ఎదురు చూసే నీకై.
కానీ నీవు మాత్రం రాలేదు ...
చాలా వచ్చాయి,వెళ్లాయి నీ జ్ఞాపకాలు
ఈసారైనా నీవే రావా !!
నా లక్ష్యం అయ్యింది ఓర్చుకుని ఉండడం
ఇక ఉండడం కష్టమే
అందుకే పంపొద్దే నీ జ్ఞాపకాలు
రావా నీవే ఇప్పటికైనా ! రావా నీవే !!
నీ ఊసులతో నే గడుపుతున్నాను
ఏమి సుఖమో,ఏమి దుఃఖమో తెలవట్లే
కానీ కాలం గతిస్తున్నది
నన్ను అడగవా ఒక్కసారైనా ఎలా ఉంటుందో
మనసు చంపుకొని బతకడం
అందుకే చాలా వచ్చాయి,వెళ్ళాయి నీ జ్ఞాపకాలు
కానీ ఈసారైనా నీవే రావా! నీవే రావా!!
ఏదైనా ఒక దారుందేమో చూడు,
నా దగ్గరికి చేరుకోవడానికి...
కోరుకో ఎల్లప్పుడు ఏమి కావాలైనా
నీ కాళ్ళ దగ్గర పెట్టేస్తా ....
కానీ నీవు రావా
నన్ను కలుసుకోవడానికి ..
కనీసం నీ సమాచారమైనా పంపించవా ...
చాలా వచ్చాయి, వెళ్ళాయి నీ జ్ఞాపకాలు...
కానీ ఒక్క సారైనా
నీవే రావా! ఒక్క సారైనా నీవే రావా!!
- మహాదేవరా..
टिप्पणियाँ