विशेष रुप से प्रदर्शित पोस्ट
प्रस्तुतकर्ता
MahaabhojMD
को
- लिंक पाएं
- X
- ईमेल
- दूसरे ऐप
నన్ను ఎందుకు కన్నావు ?
జీవితంలోని ఆటో పోటులకి
భయపడి నా కొడుకు
నన్ను అడిగెను
నన్ను ఎందుకు కన్నావు అని
కానీ ఈ ప్రశ్నకు
నా దగ్గర ఏ విధమైన
జవాబు లేదు
ఎందుకంటే మా నాన్న కూడా
నన్ను అడగకుండానే
కన్నారు ఎందుకో!
అలాగే మా నాన్న నీ
అడక్కుండానే వాళ్ల నాన్న,
వాళ్ల నాన్న అడగకుండానే వాళ్ల నాన్న.
కన్నారు ఎందుకో! .
సృష్టి రహస్యం ఏమిటి అంటే
జీవితంలో ఆటుపోట్లు
మొదట్లో కూడా ఉన్నాయి
ఈ రోజుల్లో కూడా ఉన్నాయి
కొంచెం ఎక్కువగానే ,
రాబోయే రోజుల్లో కూడా
ఉండొచ్చు ఇంకా ఎక్కువగానే .
కానీ ఒక్క మాట
నీవు కూడా అందరిలాగా
కనవద్దు కొడకా !
నీ కొడుకు ని అడిగి
ఆ తర్వాత కను ! .
మూలకవి: హరి వంశ రాయ్ బచ్చన్
అనువాదం: మహదేవ్
टिप्पणियाँ