विशेष रुप से प्रदर्शित पोस्ट
प्रस्तुतकर्ता
MahaabhojMD
को
- लिंक पाएं
- X
- ईमेल
- दूसरे ऐप
పిరికి వాడిని కాదే ప్రియతమా
ప్రాణప్రదంగా నిన్నే ప్రేమించు చుంటిని
చెప్పడానికి పలమారు సార్లు ప్రయత్నిస్థిని
కానీ బాధ్యత అనే సంకెళ్లు
బంధాలు అనే బేడీలు
బంధించి మిగిల్చేను ఎడబాటుని…
చుక్కల పల్లకి నీతో ఎక్కాలని
కళ్యాణ ఆటలనీ నీతోనే ఆడాలని
ప్రేమపాటలను నీతోనే పాడాలని
అరుంధతి నక్షత్రం నీకే చూపాలని
ఎన్నో ఊసులు నీకే చెప్పాలని
ఎన్నో కలలు, ఆశలు కనీ
సాకారం చేసుకోవాటానికి
దాచుకుంటిని మనసులోనే….
నా ఆశలు, నా కలలు
నేలకొరిగి మట్టి పాలయ్యెను కొన్ని రోజులలోనే..
నిన్ను మరువగలేను, తెగించి వచ్చి కలవనులేను
నిన్ను మరువలేక, కలవలేక
ఊహల్లో జీవిస్తూ
విరహవేదనను అనుభవిస్తూ
చేస్తున్నాను కాలయాపనం…
टिप्पणियाँ