विशेष रुप से प्रदर्शित पोस्ट

ఇష్టమనే అనుకుంటా... MD

 ప్రియమైన అని మొదలుపెట్టి 

దాని కింద నీ పేరు మాత్రమే రాస్తాను 

ఇప్పుడు కొంచెం స్థలం వదిలి  

క్రింద రాస్తాను ఎప్పటికీ నీ వాడనేనని 

మధ్యలో ఖాళీ స్థానం ను నీవే పూరించాలి 

పేపర్ లోనే నా మనసు భాషని 

అర్థం చేసుకోవాలి నీవే 

ఏ విధంగా అర్థం చేసుకున్ననూ 

అది నాకు అంగీకారమే

 తలవంచుకున్న 

కళ్ళలో కళ్ళు పెట్టి చూడకపోయినా 

మౌనంగా ఉన్న 

పేపర్ ఖాళీగా ఉన్న 

ఈ అన్నింటి అర్థం నేనంటే 

ఇష్టమనే అనుకుంటా….


टिप्पणियाँ