विशेष रुप से प्रदर्शित पोस्ट

ఆహ్వానిస్తే బాగుండు అని -Ravan.MD

ఈ కొత్తగా ఏర్పడిన వీధులలో
ఎక్కడైతే ప్రతిరోజు కొత్త కొత్త ఇల్లు కట్టబడుతున్నాయో
నేను తరచుగా మరిచిపోతుంటాను అక్కడ దారి
మోసగిస్తుంటాయి పాత గుర్తులు 
వెతుకుతూ ఉంటాను ఇంతకు ముందు 
చూసినటువంటి పెద్ద చెట్టు
దాని పక్కన ధ్వంసమైన ఇల్లు 
మరియు ఖాళీ స్థలమును 
ఎక్కడైతే ఎడమవైపు
తిరగాల్సి ఉండేది నేను
మళ్లీ రెండు ఇళ్ల తర్వాత 
రంగులేని ఇనుప గేటు గల ఒక అంతస్తు ఇల్లు... 
కానీ ఇప్పుడు పెద్ద చెట్టు స్థలంలో పెద్ద ఇల్లు నిర్మించారు 
ధ్వంసమైన ఇల్లుని అందంగా అలంకరించారు
ఖాళీ స్థలంలోని ఏదో కట్టడం జరిగింది 
ఒక అంతస్తు ఇల్లు రెండంతస్తులు అయింది. 
పాత గుర్తులేమి కనబడలేదు ఇప్పుడు...
ఇక్కడ రోజూ కొత్త- కొత్త గా కట్టబడుతూనే ఉన్నాయి రోజూ ఏదో ఒకటి ధ్వంసం అవుతూనే ఉంది 
ఇక్కడి గుర్తుల మీద నమ్మకం లేదు
ఒకే రోజులో పాతదైపోతుంది ఊరంతా
ఎలాగంటే నిన్న కట్టిన ఇల్లే ఈరోజుకి పాతదానిలా అనిపించేలా..
పాత గుర్తుల తో వెళ్ళవలసిన ఇంటిని గుర్తుపెట్టుకుంటే కాళ్లు అరిగేదాకా తిరగాల్సిందే…
ఆ కొత్త నిర్మాణాలను చూసి ఆశ్చర్యమేసింది ఏందంటే నేను వానకాలంలో వెళ్ళానేమో 
రావడంలో చలికాలం వచ్చేసినట్టుంది
చైత్రమాసంలో ఆ వీధిలో వెళ్ళింటినేమో తిరిగి రావడం లోనే వైశాఖమాసం వచ్చినట్టుంది.
ఈ రోజులలో వీధులన్నీ వేగంగా మారుతూ ఉన్నాయి.
ఇప్పుడు ఒకే ఉపాయం ఏంటంటే ప్రతి వాకిలిని వాయిస్తూ అడగాలి, 
ఇది ఆ ఇల్లేనా 
ఏదైతే నేను వెతుకుతున్నానో  అని..
కానీ సమయం చాలా తక్కువగా ఉంటాది మన దగ్గర 
మనం అడగడంలో కూడా ఊరికే బెంబేలెత్తిపోతాం..
మనసులో ఇప్పుడు ఉన్న ఆలోచన ఒకే ఒక్కటి
మనకు తెలిసిన వారు మనల్ని గుర్తుపట్టి 
మన పేరు పిలిచి ఇంట్లోకి  
ఆహ్వానిస్తే బాగుండు అని.

टिप्पणियाँ