विशेष रुप से प्रदर्शित पोस्ट

రిజర్వేషన్లు .... రిజర్వేషన్లు..-Ravan MD

రిజర్వేషన్లు రిజర్వేషన్లు అని 
ఈర్ష్య పడుతూ కించపరుస్తారేమీ మమ్మల్ని 
రిజర్వేషన్లు అనేవి దయా దాక్షణాలకై 
 మమత-అనురాగాలకై , 
 ప్రేమ-స్నేహంతో ఇచ్చినవి కాదే  ..
రిజర్వేషన్లు అనేవి మీ వంశ పూర్వికులు 
వారి దౌర్జన్య ,దోపిడీలకు 
చిత్ర -విచిత్ర పరిహాసాలకు ,వింత చేష్టలకు 
వంకర మాటలకు, చిత్రహింసలకు 
అత్యాచారాలకు, మానభంగాలకు 
బలవంతంగా విధించిన శిక్షలకు 
పరిహారంగా 
దేశంలో సమానత-సమైక్యత పెంచడానికి 
ఇచ్చినటువంటి వడ్డీలే..
ఆ వంశ వారసులారా ఇప్పుడు
అసలును ఏ రూపంలో,
 ఎప్పుడు ఇస్తారో చెప్పండి 
 ఆనాడు విలువలు మాట్లాడి 
ఈనాడు లెక్కలు అడుగుతూ 
పుండు మీద కారం చల్లడం 
ఎంత సబబో తెలుసుకొని 
మాతో కలిసి మమ్మల్ని బ్రతకనివ్వండోయ్
కుళ్ళు కుతంత్రాలతో బ్రతకాలనుకున్న 
విషపురుగులాంటి వివేక విజ్ఞానవంతులారా…..

टिप्पणियाँ