विशेष रुप से प्रदर्शित पोस्ट

ఈ సారైన నీవే రావా!! (रावण.MD)

 

నీవు నాతో లేవన్న బాధ

మళ్లీ కలుస్తామో లేదో అన్న బాధ

మళ్లీ సమాజంలోని బాధలు

ఏమి చేయను అయినా

కనులు ఎదురు చూసే నీ కొరకై

రాత్రంతా మేలుకొని ఎదురు చూసే నీ కొరకై

నీవు మాత్రం రాలేదు

చాలా వచ్చాయి వెళ్ళాయి నీ జ్ఞాపకాలు

ఈసారైనా నీవే రావా

నిన్నే తలుచుకుంటూ , చిరునవ్వు నిలుపుకుంటూ

నీకై వేచి ఉంది నా మది

కాలం కరుగుతున్న శోకం పెరుగుతున్న

 ఏనాటికైనా కలుస్తావనీ

కనులను మూసుకొని కలలో నిన్నే చూస్తూ

నా మదికి మిగిలిస్థిని వ్యధ

అందుకే పంపొద్దు నీ జ్ఞాపకాలు

చాలా వచ్చాయి వెళ్ళాయి నీ జ్ఞాపకాలు

ఈసారైనా నీవే రావా!! రావా నీవే!!

నీ ఊసులతో నే గడుపుతున్నాను

ఏమి సుఖమో ఏమి దుఃఖమో తెలవట్లేదు

గతిస్తున్నది కాలమేమో

నాకు మాత్రమే తెలుసు

మనసును చంపుకొని బతకడం

నా హృదయ రాణి నీ ఆలోచన లేకుండా నా మది నిదురించి

అయింది కొన్ని కోట్ల క్షణాలు

ఆ అన్ని క్షణాలలో ఆత్మ శాంతి కరువై అరులు చాచాను నీ ప్రేమకే…..

అందుకే చాలా వచ్చాయి వెళ్ళాయి నీ జ్ఞాపకాలు

కానీ ఈ సారైనా నీవే రావా.. రావా నీవే…

ఏదైనా ఒక దారి ఉందేమో చూడు

నా దగ్గరికి చేరుకోవడానికి

నీ ప్రాణ, మాన, గౌరవాలకు ఏ చిన్న ఆటంకం దరిచేరనివ్వనులే..

నాకైతే నువ్వు లేని ఏ రోజు కాదే తీపి రోజు

కేవలం రోజులు మాత్రమే మారుతున్నాయి

నా లోని విరహం కాదు , అందుకే

చాలా వచ్చాయి వెళ్ళాయి నీ జ్ఞాపకాలు

కానీ ఈ సారైన నీవే రావా!! ఒక్కసారైనా నీవే రావా!!

रावण.MD


टिप्पणियाँ