विशेष रुप से प्रदर्शित पोस्ट
प्रस्तुतकर्ता
MahaabhojMD
को
- लिंक पाएं
- X
- ईमेल
- दूसरे ऐप
ఏ కులము బాబు మీది ?
“దళితులము సార్”
అంటే దేనిలో వస్తారు ?
"గుడిమెట్లను ఎక్కనివ్వని వారిలో ,
ఇంటి గుమ్మం దాటినివ్వని వారిలో,
తిట్లను-బెదిరింపులను భరించేవాళ్ళలో ,
సపరేటు ప్లేటు ఎడ్ల సావిట్లో పెట్టించుకునేవారిలో సార్".
నేనేమో హిందువులలో వస్తావని అనుకున్నా!!
వస్తానుగా సార్ కానీ మీ ఓట్లప్పుడు మాత్రమే.
అట్లే ఏం తింటుంటారు బాబు ?
“ఒక దళితుడు తినేది తింటాను సార్”
అది కాదు అంటే ఏమేమి తింటుంటారు ?
మీలాంటి పెద్దల , రెడ్ల, ఊరి పెద్దమనుషుల దగ్గర తిట్లు ,
పేదోళ్ల ఇంట్లో దొరికే రొట్టె- కారం ,
అప్పుడప్పుడు వరిబువ్వ-ఉత్తపప్పు తింటుంటాం సార్.
నేనేమో చికెన్ ,మటన్, పన్నీరు తింటుంటారేమో అనుకున్నా…!
అవి కూడా తింటూంటాను సార్ కానీ మీ ఓట్లప్పుడు మాత్రమే.
మరి ఏమేమి తాగుతుంటారు బాబు ?
“ ఓ దళితుడు తాగేది తాగుతుంటాను సార్!”
అవే ఏమేమి తాగుతుంటారు?
అంటరానివాళ్ళమనే దుఃఖాన్ని,
ఆశలు-ఆశయాలను చంపుకున్న బాధలను మింగుతూ ఉంటాం సార్ .
నేనేమో కల్లు, సారాయి, బీరు, కోటరు తాగుతుంటారని అనుకున్నా.. !
అవి కూడా తాగుతాను సార్ కానీ మీ ఓట్లప్పుడు మాత్రమే …
- MAHADEV.M.CH
टिप्पणियाँ