विशेष रुप से प्रदर्शित पोस्ट

వెళ్ళిపో తక్షణమే. -Raavan Paul Khan.MD

 వెళ్ళిపో తక్షణమే

చరిత్రకెక్కని జీవితమా వెళ్ళిపో తక్షణమే

ఎన్నో విజయాలను సాధించాల్సి ఉంది

ఎన్నో కర్తవ్యాలను పాటించాల్సి ఉంది

ఎంతో బాధను మరవాల్సి ఉంది

ఎన్నో అప్పులు తీర్చాల్సి ఉంది

కనుకే చరిత్రకెక్కని జీవితమా వెళ్ళిపో తక్షణమే …

ఎదిగే క్షణాలలో అణిగి మణిగి ఉండటం వలన

విలువలు తప్పాయి కొన్ని

బాధ్యతలు మరిచాయి కొన్ని

సరిచేయాలి ఆ విలువలను

గుర్తు చేయాలి ఆ బాధ్యతలను

నిద్ర పోవాలి రాత్రులు ప్రశాంతంగా ఇకనైనను

కనుక చరిత్రకెక్కని జీవితమా వెళ్ళిపో తక్షణమే …..

సంబంధాలు కొన్ని ఏర్పడి తెగిపోయాయి

కలిసినట్టు కలిసి కొన్ని వదిలెళ్ళి పోయాయి

తెగిన, వదిలిన సంబంధాల

గాయ,భాధ,వ్యధ,విరహాల రూపు మార్చాలి

కనుకే చరిత్రకెక్కని జీవితమా వెళ్ళిపో తక్షణమే ….

ఆశయాలు కొన్ని మిగిలి ఉన్నాయి ఇంకా

శ్రమించాల్సి ఉంది వాటికోసం

పూర్తిగా విప్పాలని ఉంది జీవితంలోని చిక్కుముడులను

ఎప్పుడూ ఆయన ఊపిరి కంటే పెద్దది

పోగొట్టుకొనూలేము, పొందనూలేము

కనుకే చరిత్రకెక్కని జీవితమా వెళ్ళిపో తక్షణమే….


टिप्पणियाँ