विशेष रुप से प्रदर्शित पोस्ट

आजादी के लिए सब लड़े थे

 कैसे होगी विकास हालत है ऐसी।। आजादी के लिए सब लड़े थे मिलजुल कर हिंदू , मुस्लिम, ईसाई ,सिख, जैन और बौद्ध ब्राह्मण, क्षत्रीय ,वैश्य ,शूद्र ,शेख ,सैयद, एवं पठान SC , ST , BC , OC और OBC ।। मगर जब गाद्दी पर बैठने की समय आया एक ही जाति बैठकर वह सिर्फ अपना जाति, राज्य ,प्रांत व परिवार को ही विकास की ओर लेकर गया और कुर्सी को बचाए रखने के लिए  दूसरा जाती परिवार प्रांत को दूर रखकर उनके कमजोरियों एवं मजबूरियों से प्यार कर अपमान का पहाड़ खड़ा किया परिणाम निकला अलग-अलग होना एक दूसरे पर यकीन ना कर पाना  छोटी-छोटी बातों पर लड़ाई झगड़ा शुरू हो जाना अतएव हालत है ऐसी कैसे होगी विकास ।।

సంతోషాల ఉగాది నిచ్చే తల్లి , నా తెలుగు తల్లి - మహాదేవుడు చిన్న.M

 సంతోషాల ఉగాది నిచ్చే తల్లి , నా తెలుగు తల్లి

పచ్చని సొగసుల పరిమళాలతో,

వసంత కోకిల తీయని రాగాలతో ,

ఉదయించే కొత్త కాంతులతో,

ఇంటింటి పండుగ శోభలతో,

పిల్లల ఆట పాటలతో,

మదినిండి ఆనందాలతో,

పంచాంగ శ్రావణాలతో ,

సంతోషాల ఉగాదినిచ్చే తల్లి ,

నా తెలుగు తల్లి ..

ఉయ్యాల ఊగులతో,

తెల్ల అంచు పంచలతో ,

భుజం మీది కండువాలతో ,

తెలుగు తేజస్సు హంగులతో ,

మన ఆదర్శ కట్టులతో ,

అమ్మతన బొట్టులతో ,

చిరు వేప పువ్వులతో ,

ముద్దబంతి నవ్వులతో ,

మామిడి తోరణాలతో ,

సంతోషాల ఉగాదినిచ్చే తల్లి ,

నా తెలుగు తల్లి ….

ఆడపడుచుల చిరునవ్వులతో ,

బంధుమిత్రుల పలకరింపులతో ,

ఆరు రుచుల ఉగాదిపచ్చడి లతో ,

వంటింటి గుబాళింపులతో ,

ఇంటిల్లిపాది సంతోషాలతో ,

సంతోషాల ఉగాదినిచ్చే తల్లి ,

నా తెలుగు తల్లి ……

పొలము ను దుక్కి దున్నే నాగళ్ళతో ,

పుడమితల్లి పలకరింపులతో ,

రైతన్న చెమట చిరుజల్లులతో ,

కొత్త సాగుల మొదలు తో ,

పలికే రామచిలుక లతో,

కులికే రాజహంస లతో ,

సాహిత్య - సాంస్కృతిక కార్యక్రమాలతో ,

అంబరాన్ని తాకే సంబరాలతో ,

మానవాళిని ఒక్కటిగా కలిపే ,

తెలుగు నామ సంవత్సర మొదటి రోజు గా ,

సంతోషాల ఉగాదినిచ్చే తల్లి ,

నా తెలుగు తల్లి………

                                                                                          - మహాదేవ్


टिप्पणियाँ