विशेष रुप से प्रदर्शित पोस्ट

ఎందుకో ఈ రోజులలో ………. -Raavan Paul Khan.MD

 ఎందుకో ఈ రోజులలో ……….

పరవశించి పోతుంటాను నిన్ను చూసిన వెంటనే 

ఎందుకో ఈ రోజులలో ,

మారిపోతున్నాయి నా ఊహలు ఎందుకో ఈ రోజులలో ,

చిగురిస్తున్నాయి కొత్త ఆశలు ఎందుకో ఈ రోజులలో ,

ఎదురు చూసే నీకై కనులు

ఏ కారణం లేకుండానే ఎందుకో ఈ రోజులలో ,

ఇది నేనేనా ఇంకెవరైనా అనే మాదిరిగా,

ఎలా- ఎలా అయిపోయావు నీవు ఇంత నిత్యవసరంగా …

పట్టించుకునే లేదు ఇంతకాలం

వర్షపు చినుకులు చెప్పే ఊసులు,

అర్థం కాలే ఇంతకాలం

చల్లని చిరుగాలి చేసే వలపులు,

తెలుసుకునే లేదు ఇంతకాలం

విరహాలను మరపించడానికే గర్జిస్తూన్నాయని మేఘాలు ,

తెలియనే లేదు ఇంతకాలం

మెరుపులు , ఉరుములు చూపించేవి జీవిత రంగులని,

చినుకులన్ని తడిపి మరి చెప్పే

కొత్తగా హుషారుతో జీవితం గడపమని ….

ఆ ఊసులే, ఉరుములే, వలపులే మనసుకు నచ్చే మిక్కిలి సంతోషాలని

ఆ సంతోషాలన్నియు ప్రకృతి మనకిచ్చే 

మరువకూడని కానుకలని. 



- మహదేవ్ (7702407621)


टिप्पणियाँ