विशेष रुप से प्रदर्शित पोस्ट
प्रस्तुतकर्ता
MahaabhojMD
को
- लिंक पाएं
- X
- ईमेल
- दूसरे ऐप
ప్రయత్నించే వాళ్లకి అపజయం ఉండదు
సెగ బెట్టి కొడితే ఇనుము వంగకుండా ఉండదు
అలాగే ఇష్టపడే ప్రయత్నిస్తే విజయం అందకుండా ఉండదు.
చిట్టి చీమ ఒక చిన్న తిండి పదార్థం తీసుకొని
దాని గూటి కి బయలుదేరుతుంది
దారిలో ఎదురు వచ్చే గోడలను, ఎత్తుపల్లాలను
ఎక్కుతూ, దిగుతూ అనేకసార్లు జారి పడుతుంది
కానీ మనసులో ని ఆత్మవిశ్వాసం నింపుకొని
ధైర్యంగా ముందుకు సాగుతుంది
ఎక్కుతూ జారడం,జారుతూ ఎక్కడం లో
ఎక్కడ ఆత్మవిశ్వాసంను కోల్పోదు
చివరికి తన కష్టం వ్యర్థం కాకుండా
తన లక్ష్యాన్ని చేరుకుంటుంది
అందుకే ప్రయత్నించే వాళ్లకి విజయం అందకుండా ఉండదు.
ఓటమి అన్నది ఒక సవాల్ లాంటిది, దానిని స్వీకరించు
ఏమి కొరత ఉందో చూసుకో, దానిని అధిగమించు
ఎప్పటి వరకు అయితే విజయం దక్కదో
అంతవరకు విలాసభోగాలు, సమయ వ్యర్థాలను వదిలేసుకో
ఈ రణ భూమిని ఎట్టి పరిస్థితుల్లో వదిలి పారిపోకు
విజయం అనునది ప్రయత్నించకుంటే వచ్చేది కాదు
ప్రయత్నించే వాళ్లకి మాత్రమే దొరికేది…
అందుకే ప్రయత్నించే వాళ్లకి అపజయం ఉండదు…
- మహాదేవ్
टिप्पणियाँ