विशेष रुप से प्रदर्शित पोस्ट
प्रस्तुतकर्ता
mani
को
- लिंक पाएं
- X
- ईमेल
- दूसरे ऐप
నకిలీ జీవితం
దుస్తులు చిన్నగా అయిపోయయ్ ,
సిగ్గు ఎక్కడినుండి వస్తుంది?
చపాతీ, పిజ్జా బ్రాండ్ గామారిపోయాయ్,
శక్తి ఎక్కడినుండి వస్తుంది?
పువ్వులు, ప్లాస్టిక్ వి అయిపోయయ్,
సువాసన ఎక్కడినుండి వస్తుంది?
ముఖం మేకప్ అయిపోయింది,
రూపం ఎక్కడినుండి వస్తుంది?
మాస్టర్లు టూషన్లు అయిపోయారు,
విద్య ఎలా వస్తుంది?
భోజనం హోటల్ లో అయిపోతుంది,
అమ్మ చేతి వంట కమ్మదనం ఎక్కడినుండి వస్తుంది?
పండుగలు, టివి ప్రొగ్రాములు అయ్యాయి,
సంస్కృతి, సాంప్రదాయం ఎక్కడినుండి వస్తుంది?
మనుషులు ధనవంతులు అయిపోయారు,
దయ ఎక్కడినుండి వస్తుంది?
ఎక్కడ చూసినా వ్యాపారమయం,
పుణ్యం ఎలా వస్తుంది?
తాళం, పాస్వర్డ్ అయిపోయింది,
భద్రత ఎలా వస్తుంది?
భక్తులు స్వార్థపరులైపోయారు,
భగవంతుడు ఎలా వస్తాడు.
వాట్సాప్లో బంధువులైపోయారు,
కలవడానికి ఎక్కడినుండి వస్తారు ?
ఉపవాసం చేస్తే భగవంతుడు
సంతోషంగా ఉంటాడు అనుకుంటే
ఈ ప్రపంచంలో ఎక్కువ రోజులు
ఆకలిగా ఉండే బిచ్చగాడు
అందరికంటే సుఖమైన వ్యక్తి అయ్యేవాడు.
ఉపవాసం అన్నం కోసం కాదు, ఆలోచన కోసం చేయండి.
మనిషి తననుతాను నిజాయితీ గా నిరూపించుకోవాలి.
ప్రపంచం భగవంతునికంటేదుఖంగా ఉంది.
పక్షి బ్రతికి ఉన్నప్పుడు చిన్న – చిన్న కీటకాలను తింటుంది,
పక్షి చనిపోయిన తరువాత కీటకాలు పక్షిని తింటాయి.
అందుకే అర్థం చేసుకోండీ !
అందుకే రాజీ పడటం నేర్చుకోండి.
మీరు శక్తివంతులు అనుకుని
ఎవరిని అవమానించవద్దు,
సమయం నీకంటే శక్తివంతమైనది.
ఒక్క చెట్టు నుండి లక్షల అగ్గిపుల్లలు తయారు చేయవచ్చు,
అదే ఒక్క అగ్గిపుల్లతో లక్షల చెట్లను మండించవచ్చు /
తగలబెట్టవచ్చు.
నెమలికి మంచి రూపాన్ని ఇచ్చి
కోరికలను లాగేసుకున్నాడు,
మనిషికి కోరికలను ఇచ్చి
సంతోషాన్ని లాగేసుకున్నాడు,
సాధువులకు సంతోషాన్ని ఇచ్చి
సంసారం
లాగేసుకున్నాడు,
నిన్ను నువ్వు గురువు అనుకోవద్దు,
భగవంతుడు మనలాంటివాళ్ళను
మట్టినుండి తయారుచేసి- మట్టిలో కలిపేశాడు.
మనిషి ప్రపంచం లో మూడు విషయాల కోసంశ్రామిస్తాడు
తన పేరు , ధనం మరియు ఇల్లు.
కానీ మనిషి చనిపోయినవెంటనే దేవుడు
వీటిని మననుంచి వేరు చేస్తాడు.
ఇదే జీవితంయొక్క నిజస్వరూపం.
అర్థంచేసుకోవడం కఠినం.
ఒక రాయి కేవలం ఒకే సారి గుడికి వెళుతుంది,
భగవంతునిగా మారుతుంది.
మనిషి ప్రతీరోజు గుడికి వెళ్తాడు
కానీ శిలగానే ఉండిపోతాడు.
ఒక స్త్రీ తన కొడుకుని జన్మనివ్వడం కోసం
తన సౌందర్యాన్ని కోల్పోతుంది,
అదే కొడుకు సుందరమైన భార్య కోసం
అమ్మ ని త్యాగం చేస్తాడు.
జీవితంలో ప్రతీచోట మనం గెలిచేస్తాం,
కానీ మరణానికి దగ్గరగా ఉన్నప్పుడూ
మనం ఓటమిని కోరుకుంటాం.
ఈ జీవితం ఎలాగైనాసాగిపోతుంది,
కానీ ఒక్కసారి మాత్రమే లభిస్తుంది,
అందుకే అర్థం
చేసుకోండి,
అందుకే రాజీ పడటం
నేర్చుకోండి…
హింది నుండి తెలుగు అనువాదం : మణికంఠ & మహాదేవుడు
Courtesy content full rights © knowledge Hindi/ insta.
Suggessions& Helps credits to keshav, Trinidad &
Tobago.
टिप्पणियाँ