विशेष रुप से प्रदर्शित पोस्ट
प्रस्तुतकर्ता
mani
को
- लिंक पाएं
- X
- ईमेल
- दूसरे ऐप
ఏ మొక్క అయినా విత్తనం లేకుండా మొలవదు,ఒక మనిషి గా ఆలోచించు విజయం సాధించు, మన నడవడిక వెనుక ఆలోచనలు తప్పకుండా ఉంటాయి. మనకు తెలిసి – తెలియకుండానే మనం వీటి గురించి ఆలోచించి ఉంటాం.
మన జీవితంలో సంతోషం – దుఖం – క్రోధం మరిన్ని భావాలకు మన ఆలోచనలే
కారణం.
కొన్ని సార్లు మనం అనుకోకుండా , అకస్మాతుగా ఒక ప్రదేశానికి వెళ్ళాం అనుకుంటాం . ఈ ఆలోచనకి కారణం
కూడా subconsismind మూల కారణం.
అకస్మాతుగా జరిగే పనులు కేవలం మనల్ని మనం
రక్షించుకోవడానికి చేస్తూ ఉంటాం. ఉదాహరణకు :-
ఆకలేస్తే అన్నం తినడం, నీళ్ళు త్రాగి దప్పిక
తీర్చుకోవడం.
మన ఆలోచనలే మనలో దుఖానికి మూలం.
కొన్నిసార్లు నిద్రలేమి . కొన్నిసార్లు మన
వద్ద ఏదీ లేకపోయినా సంతోషంగా ఉండటం. ఆలోచనల వల్లే జరుగుతుంది. ఆలోచనలే విత్తనాలు, మనం తీసుకునే నిర్ణయాలు – చేసే పనులే మొక్కలు , మనలో మానసిక ఒత్తిడి కి
కారణమే ఫలం.
మన జీవితంలో మన ఆలోచనలే విత్తనాలు. ఈ విత్తనాలను తల్లిదండ్రులు కధలరూపంలో మన మదిలో
నాటుతారు. వీటినే మనం సంస్కారం అంటాం. ఇవే భవిష్యతులో సంతోషంగా జీవించడానికి దోహదపడతాయి.
ఎవరికైనా భయం , ఒత్తిడి , ఆశ్చర్యం కలిగితే దీనికి కూడా
ఆలోచనలే కారణం, ఇవి ఎక్కడినుండి వస్తాయి ఎవరూ చెప్పలేరు.
లక్ష్యాని చేరుకోవాలంటే మనం ముందు ఆలోచించాలి.
ఆలోచించకుండా లక్ష్యం కోసం పరిగెత్తటం మన మూర్ఖత్వం.
కానీ , చెడు ఆలోచనల పై నుండి మంచి ఆలోచనల పై ధ్యానాన్ని మరల్చవచ్చు.
కొంత కాలం తరువాత. మనం చెడు ఆలోచించం.
మంచి ఆలోచనలు మనల్ని ఎల్లప్పుడూ సంతృప్తిపరుస్తూ
ఉంటాయి. కొన్ని రోజుల తరువాత కధ మళ్ళీ మొదటికి వస్తుంది.
కారణం మన మదిలో ఇంకా కొన్ని వేల చెడు విత్తనాలు
ఉండవచ్చు. మనకు తెలిసీ – తెలియకుండానే నాటిన విత్తనం ఇప్పుడు ప్రతిఫలాన్ని ఇస్తుంది.
కొన్ని వేల చెడు విత్తనాలకు ధీటుగా ఇంతకుమించి
మంచి విత్తనాలను నాటడమే మార్గం.
ముందు మన ఆలోచనలను మంచి విషయాలపై మరల్చాలి.
ఆలోచనలు మారితే జీవితం మారుతుంది.
నిజాన్ని స్వీకరించాలి.
లేకపోతే మొదట మానసికంగా, తరువాత శారీరికంగా ఒత్తిడి పెరుగుతుంది,
దీనికి మందు లేదు.
ఎద్దులు బండి లాగితే చక్రాలు తనంతటతానే ఎలా
తిరుగుతాయో, అలాగే చెడు ఆలోచనలు చేస్తే జీవితంలో
నొప్పి అనుభవించవలసిందే.
ప్రయత్నం చేసి స్పస్టంగా ఆలోచిస్తే, సంతోషం మన వెంటే నీడలా వస్తుంది. సంతోషంగా ఉంటే చాలు ఇంకేం చేయనవసరం
లేదు.
అనవసరంగా కోపం వచ్చే ప్రసక్తే లేదు.
ఒకవేళ సమాజంలో ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేస్తుంటే, మనం కోప్పడకూడదు. ఎందుకంటే అతనికి మంచి అంటేనే తెలియదు కనుక. అతను
పెరిగిన వాతావరణం అలాంటిది కనుక తను తప్పు చేస్తున్నాడు.
ఒక పద్ధతి :
తప్పు చేస్తున్న వ్యక్తి పై మనం కోపడ్డటం.
వేరే పద్ధతి :
తప్పు చేస్తున్న వ్యక్తిని అర్థంచేసుకోవటం, తరువాత అతనిని తప్పనిసరిగా చట్టం ద్వారా శిక్షించడం. లేకపోతే ఇతనిని చూసి ఇలాంటి వాళ్ళు ఇంకా పుట్టుకోవస్తారు.
శుద్ధమైన ఆలోచనలు అంటే ఏమిటి ?
పవిత్రమైన ఆలోచనలు, సమస్యను ఎదుటివ్యక్తి కోణంలో ఆలోచిస్తే 99 శాతం సమస్యలకు సమాధానం ఇక్కడే లభిస్తుంది.
అపవిత్రమైన ఆలోచనలు అంటే ఏమిటి ?
నిజాన్ని తెలుసుకోకుండా మనల్ని మనం ఎల్లప్పుడూ
తప్పులేకుండా చూపించి, ఎదుటి వారిదే తప్పు అని
రుజువుచేయటం.
- ఆలోచనలని ఎంపిక చేసుకునే అవకాశం మీ వద్ద ఉంది.
-
సందీప్ మహేశ్వరి
మనం ఎక్కడైనా అవినీతి, టివి లో ఫైటింగ్ సీన్లు చూసినప్పుడు తాత్కాలికమైన ఆనందాన్ని పొందుతాము, కానీ ఈ ఆలోచనల ప్రభావం మదిలో అలాగే ఉండిపోతుంది.
మన ఆలోచనలద్వారా భవిష్యత్తుని నిర్మించుకోగలము.
మనకు అనవసరమైన ఆలోచనలకు సమయం కేటాయించకూడదు.
మీ మెదడు ఒక వనం అనుకుంటే, ప్రతిరోజూ చెడు ఆలోచనలను పక్కనపెట్టి, మంచిగా
ఆలోచిస్తే మదిలో బృందావనాన్ని నిర్మించుకోగలం.
మంచి ఆలోచన అంటే ?
ధన్యవాదాలు / కృతజ్ఞత తెలుపడం. మంచిగా ఆలోచిస్తూ
బృందావనంలో మంచి విత్తనాలను నాటడం.
సమస్యలు మన ఆలోచనల్ని మరింత ధృడపర్చడానికే
వస్తాయి.
సమస్యలను ఎదురుకోవడానికి ముందునుంచే సిద్ధంగా
ఉండండి.
మనకు తెలుసు సమస్యలు మన జీవితంలో ఒక భాగం
మాత్రమే,
కానీ సమస్యలే జీవితం కాదు.
ఒకవేళ మీ మూడ్ బగలేకపోతే, దుఖంగా ఉంటే ?
నేను ఏమైనా తప్పు ఆలోచన చేస్తున్ననా ?
ఎవరు ఆలోచనలను నిర్మిస్తున్నారు ?
దీని కరణంగా ఇలా అవుతుందా?
ఆలోచన ఎవరి చేతిలో ఉంది?
మిమ్మల్ని మీరు ప్రశ్నించండి ?
దుఖాన్ని అక్కడే ఆపాలి, లేదా దుఖం పెరుగుతూ ఉంటుంది.
దుఖానికి కారణం తెలుసుకుని, దుఖాన్ని వేర్లతో సాహా పెక్కిలించాలి. కానీ కొందరు ప్రత్యమ్న్యాయంగా
ఆలోచనలను ఆపేసి నిద్రపోతారు ఇలా చేయటం సరైన నిర్ణయమా ?
"ఆస్ ఏ మ్యాన్ థింకేడ్" పుస్తకం నుండి నాకు నచ్చిన విషయాలు. మీకు నచ్చితే కొనండి మళ్ళీ – మళ్ళీ చదవండి.
special credits to సందీప్ మహేశ్వరి
ప్రచురణ కర్త "మనికంఠ బనగానపల్లె"
टिप्पणियाँ