विशेष रुप से प्रदर्शित पोस्ट

రక్షించవచ్చు ప్రజాస్వామ్యాన్ని Raavan.MD

 .

ఏడుపు, కన్నీళ్లు మరియు కాలాలు మారిన 

మారట్లేదు సామాన్యుల తలరాతలు.. 

ఆ కాలంలో అడవి మృగాలు 

అప్పుడప్పుడు వేధించేవి 

ఈ కాలంలో ఎల్లప్పుడూ వేధిస్తూనే ఉన్నాయి ఖాకీలు..

  ఖాకీలు సామాన్య ప్రజలు రక్షణ వదిలేసి 

పేరు, పోస్టు ,పరపతికై 24/7  

రక్షిస్తున్నారు ఖద్దరోళ్ళా అంగ అంగాలను…. 

రౌడీలను గుండాలను మోసగాళ్లను 

తిరుగుబోతులను తయారు చేయిస్తున్నారు 

వారిని ప్రజా ద్రోహులుగా మారుస్తున్నారు 

అందుకే ఖాకీల నుండి రక్షణను కాకుండా 

భక్షించుకుంటే చాలు అనే నానుడి 

ప్రతి సామాన్యుని నోటిలో ఉండిపోయింది 

అలాగే ఖాకీల నుండి అండకాకుండా 

ఎలా దండిస్తారని భయం ఎక్కువైపోయింది

అన్ని ఖాకీలు తన కర్తవ్యాన్ని పాటిస్తే సక్రమంగా 

రాజకీయ నాయకుల దౌర్జన్యం , రౌడీలా రాచరికం  

పెద్దమనుషులమనే ముసుగులో చేసే పెత్తనం 

డబ్బు అధికారంతో చేసే మోసం 

తెగువతో తగువను పెట్టుకునే తిరుగుబోతుల విలాసం అన్నింటిని అరికట్టవచ్చు మరియు శిక్షించవచ్చు 

దానితో రక్షించవచ్చు ప్రజాస్వామ్యాన్ని.


రావణ్ . MD

टिप्पणियाँ